'యూపీలో మాఫియాలను బుల్డోజర్తో తొక్కిపడేశాం - ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే అదే జరుగుతుంది' - కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌పై యోగి ఆదిత్యనాథ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 5:28 PM IST
UP CM Yogi Adityanath Mahabubnagar Public Meeting : ఉత్తరప్రదేశ్‌లో మాఫియా, అక్రమ దందాలదే రాజ్యంగా ఉండేదని.. నెలలు నెలలు కర్ఫ్యూలు సాగేవని... బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వచ్చాక మాఫియాలకు అక్రమ దందాలను బుల్డోజర్తో తొక్కిపడేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Yogi Adityanath Election Campaign in Mahabubnagar : కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు ఉండేవని మోదీ అధికారంలోకి వచ్చాక అవేవీ లేవని ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. భారత్‌పై దాడికి, చొరబాట్లకు ఎవరూ సాహసించరని, ఒకేవేళ చేస్తే మెరుపుదాడులు చేసి బదులిస్తామని వారికి తెలునని వివరించారు. సరిహద్దుల రక్షణను బలోపేతం చేయడంతో పాటు దేశంలో మౌలికల వసతుల కల్పనకు ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.
పేపర్ లీకేజీల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోతోందని.. యూపీలో ఆరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి మాత్రమే పెద్దపీట వేశారని, సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్ నినాదంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Yogi Adityanath Fires on Congress and BRS : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిర నిర్మాణం జరిగేదా అని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు. వీఆర్ఎస్కు సమయం వచ్చిందని.. అందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఉమ్మడి స్నేహితుడు ఎంఐఎం అని.. ముగ్గురు ఒకే తానులోని ముక్కలుగా అభివర్ణించారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా ముగ్గురికీ వేసినట్లేనన్నారు. మహబూబ్‌నగర్‌ను తిరిగి పాలమూరు మార్చడానికే ఆయన ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.