'యునాని వైద్యంలో నూతన ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధికి భారీ అవకాశాలు' - యునాని మెడిసిన్‌పై నేషనల్ కాన్ఫరెన్స్
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2023, 5:04 PM IST
Unani National Conference On Innovations in Hyderabad : యునాని వైద్యంలో నూతన ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని (సీసీఆర్‌యూఎం) డీజీ డాక్టర్ జాహీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎర్రగడ్డలోని నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని ఫర్ స్కిన్ డిజార్డర్స్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ డబ్ల్యూ సెల్వమూర్తి, ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, నైపర్ డైరెక్టర్ శైలేంద్ర సరాఫ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిత్య జీవితంలో తీసుకునే ఆహారానికి వైద్యపరంగా ఉన్న విలువలతో పాటు యునాని విభాగంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఉన్న ఆస్కారాన్ని ఈ సదస్సులో చర్చించారు. సరికొత్త అంకుర సంస్థలకు యునానిలో అనేక రకాల అవకాశాలు ఉన్నాయని డాక్టర్ జాహీర్ అహ్మద్ తెలిపారు. మరీ ముఖ్యంగా యునానీతో చర్మ సంబంధిత వ్యాధులను మెరుగ్గా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తరహా చికిత్సలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన మొబైల్ అప్లికేషన్లు, యాప్‌లు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు.