డ్రైవర్ నిర్లక్ష్యం, అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన రెండేళ్ల పాప మృతి - హబ్సిగూడలో పాప మృతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-01-2024/640-480-20428254-thumbnail-16x9-baby.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 4, 2024, 5:15 PM IST
Two Year Girl Died under School Bus : హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. పాప తండ్రి తన కమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు రోడ్డుపైకి వచ్చారు. తన తండ్రి, అమ్మమ్మతో పాటు చిన్నారి జావ్లానా సైతం సోదరుడిని స్కూల్‌కు పంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పాప తండ్రి డ్రైవర్‌తో మాట్లాడుతుండగా చిన్నారి జావ్లానా అమ్మమ్మ దగ్గరి నుంచి తన తండ్రి దగ్గరకు పరుగులు తీసింది.
Two Year Baby Died at Habsiguda : ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ వాహనం తీస్తుండగా ప్రమాదవశాత్తు పాప జావ్లానా టైర్ కింద పడి మృత్యువాత పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ, జాన్సన్ గ్రామర్ స్కూల్ ముందు ధర్నా చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాప మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.