TTD Restrictions on Children Below 15 Years: తిరుమల మెట్లమార్గంలో 15 ఏళ్లలోపు పిల్లలకు.. ఆ టైం దాటితే బంద్! - 15 ఏళ్లలోపు పిల్లలకు తిరుమలలో కొత్త రూల్స్
🎬 Watch Now: Feature Video
TTD Restrictions on Children Below 15 Years: తిరుమలకు నడకదారిన వెళ్లే 15 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్నం 2 తర్వాత అనుమతిని నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తరచూ చిరుత దాడులు జరుగుతున్న నేపథ్యంలో తితిదే ఈ మేరకు ఆంక్షలు విధించింది. నిన్న జరిగిన చిరుత దాడి ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన పలువురిని తీవ్రంగా కలచివేస్తోంది. అదే విధంగా గతంలో కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల దృష్ట్యా నడకదారిలో టీటీడీ అధికారులు, పోలీసులు అప్రత్తమయ్యారు. తిరుమలకు వస్తున్న చిన్నారులకు 7వ మైలు వద్ద నుంచి చేతికి ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌లను అమరుస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను తేలికగా గుర్తించేందుకు ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్‌ఫ్రీ నంబర్ నమోదు చేస్తున్నారు.