త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన - టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 3:41 PM IST

TSPSC New Board in Telangana : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి రేపటి నుంచి ప్రారంభం కాబోయే ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను విడుదల చేశారు. 

CM Revanth responds on Group-2 Exam : అనంతరం సీఎం మాట్లాడుతూ నిరుద్యోగులు గాబరాపడొద్దని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ కొత్త బోర్డు ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో, బోర్డు ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని తెలిపారు. సభ్యుల రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత నాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులను పరిష్కరించి కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్షలపై త్వరలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.