హైవేపై రెండు ట్రక్కులు ఢీ.. భారీగా మంటలు.. డ్రైవర్లు సజీవదహనం - రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Truck Fire Accident In Rajasthan : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు. భిల్వాఢా జిల్లా గులాబ్‌పురాలోని జాతీయ రహదారి 79పై.. ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ట్రక్కుల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు అగ్నికి ఆహుతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలు ఆర్పివేశాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు పోలీసులు. ఒక ట్రక్కులోని డ్రైవర్ నిద్రమత్తుతో రాంగ్ రూట్లోకి వెళ్లడం వల్ల.. ప్రమాదం జరిగిందని తెలిపారు. "ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ట్రక్కులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇద్దరు డ్రైవర్లు మాత్రం సజీవదహనం అయ్యారు" అని గులాబ్‌పురా పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ గజరాజ్ చౌదరీ చెప్పారు.