Traffic CI Attack on Private Travels Driver Viral Video : కాలితో తన్ని.. చెంపపై కొట్టి.. జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వైరల్​ వీడియో

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 5:13 PM IST

thumbnail

Traffic CI Attack on Private Travels Driver Viral Video : జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వెంకట్​ రెడ్డి వికృత చేష్టలు బయటపడ్డాయి. రాత్రి వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, డ్రైవర్లను కాలితో తంతూ.. బూతులు తిడుతూ.. ఇష్టమొచ్చినట్లుగా కొట్టి హింసిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి. ట్రాఫిక్​ను నియంత్రిస్తూ, వాహనదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ట్రాఫిక్ పోలీసులు.. వారి శాడిజాన్ని బస్సు డ్రైవర్లపై ప్రదర్శిస్తున్నారు. డ్రైవర్ తప్పు ఏమైనా ఉంటే, చలానా వేసి కేసులు పెట్టాల్సిన పోలీసులు.. దుర్బాషలాడుతూ.. కొట్టి వారిని హింసిస్తున్నారు. జీడిమెట్ల ప్రధాన రహదారిలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ల వద్దకు శనివారం రాత్రి సీఐ వెంకట్​ రెడ్డి వచ్చి వారితో దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఓ చోదకుడిపై కారణం లేకుండా చేయి చేసుకున్నాడు. ఇదంతా ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్​గా మారింది.

ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని గానీ.. దాడులకు పాల్పడటం ఏంటని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాత్రి 10 గంటల తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరిగేందుకు అనుమతి ఉన్నా.. ట్రావెల్స్ యాజమాన్యం ఒత్తిడితో డ్రైవర్లు ముందే రోడ్లపైకి వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.