Tomato Theft in Sangareddy : ధరలోనే కాదు.. దొంగతనాల్లోనూ.. 'టమాట' హల్చల్! - టమాట ధరలు తెలంగాణ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-08-2023/640-480-19152336-777-19152336-1690885698435.jpg)
Tomato Theft In Vegetable Shop : దేశవ్యాప్తంగా టమాటాల ధరలు కొండెక్కికూర్చున్నాయి. కొన్ని చోట్ల వీటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్యులు టమాటాలు కొనడం కష్టంగా మారింది. ధరలు పెరుగుదలతో టమాట దొంగతనాలు సైతం పెచ్చుమీరుతున్నాయి. దానికి కారణం పెరిగిన ధరలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యే హెల్మెట్ పెట్టుకుని మరీ చోరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అది మరువక ముందే మరో చోరీ ఘటన ఆ జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట మార్కెట్ యార్డులో కూరగాయల వ్యాపారి నరేష్.. షాపులో టమాటాలు ఇతర కూరగాయలు అమ్మకానికి ఉంచారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుకాణంలో చొరబడి తమ 10 బాక్సుల టమటాలను, సుమారు ఐదు వేల రూపాయలను దొంగిలించారని బాధితుడు నరేష్ పేర్కొన్నారు. దొంగిలించిన ఒక్కో బాక్సు ధర సుమారు నాలుగు వేలు ఉంటుందని ఈ ఘటన వల్ల తనకు రూ.45వేల నష్టం వాటిల్లిందని వాపోయాడు.