Prathidwani: మమకారంతో కనిపెంచిన.. అమ్మానాన్నలపై ఏదీ కనికరం?

By

Published : May 8, 2023, 9:18 PM IST

thumbnail

Today's Prathidwani on the Aged Care Act- 2007: బిడ్డల ఉన్నతినే ఆశించిన నిస్వార్థపరులు.. అయిన వారికి భారమై.. దూరమై.. చివరికి ఒంటరిగా మిగులుతున్నారు. వంతుల వారి జీవితం భారమై తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతి చేసుకున్న ఓ పెద్దాయన కష్టం కళ్ల ముందు నుంచి చెరగకముందే.. పురుగుల మందు తాగిన వృద్ధ దంపతుల దైన్యమే సమస్య తీవ్రతకు నిదర్శనం. అయితే.. ఈ రెండు ఉదంతాలే ఈ కన్నీటి కథకు మొదలో, ముగింపో కాదు. 

పెంచి పెద్దచేసి ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రులపైనే వీరితో మనకేం అనుకుంటూ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అనేకమంది ప్రబుద్ధులు. అసలీ దుస్థితికి కారణం ఎవరు? జీవిత చరమాంకంలో ఆ పండుటాకులకు కనీస రక్షణ, ఆసరా, భరోసా ఎలా? పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన విషయంలో వయో వృద్ధుల సంరక్షణ చట్టం-2007 ఏం చెబుతోంది? వృద్ధుల బాగోగుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై న్యాయపరంగా తీసుకునే చర్యలు.. మొదలైన వాటిపై ఇదే నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.