Prathidwani : 'ధరణి' సమస్యలు ఇకనైనా తీరేనా..? - ధరణి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18439422-550-18439422-1683385655797.jpg)
Prathidwani Debate on Dharani Problems : భూ సమస్యల పరిష్కారం కోసం రైతన్నలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగినా.. సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేది. నేడు ప్రతిదీ ఆన్లైన్మయం.. రాష్ట్రంలో వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ దస్త్రాల నిర్వహణకు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్ రూపొందించింది. కానీ ఇది తప్పుల తడకగా ఉంది. ధరణి సమస్యలు తీరేది ఎప్పుడు..? ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకు చేరింది. లోపాలమయంగా మారిన నూతన వ్యవస్థలో గుర్తించిన 20 సమస్యలను 4 వారాల్లోగా పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్డ్ సేల్‌డీడ్‌తో పాటు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడం, ఇతర ధరణి సమస్యల పరిష్కారంలో జాప్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. మరిప్పుడు ధరణి విషయంలో జరగాల్సిన కార్యాచరణ ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.