షో రూంలో దొంగతనం - లాకర్ బరువుందని చెత్తలో వదిలేసిన దొంగలు - theifs theft huge amount in car showroom

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 9:56 PM IST

Thieves Theft Huge Amount in Car Showroom : సులభంగా దొంగతనం చేసి ఆర్థికంగా లాభపడదామనుకున్నారు పలువురు దొంగలు. దాని కోసం ఎప్పటి నుంచో వ్యూహాలు రచించారు. సమయం చూసుకొని ఓ కార్ షో రూమ్​లో చోరీకి పాల్పడ్డారు. ఆ సమయంలోనే షో రూమ్​ లాకర్​ను కూడా చోరీ చేశారు. అది కాస్త బరువుండడంతో చెత్తకూప్పలో వదిలేశారు. కానీ వాళ్లకు తెలియదు అందులోనే డబ్బులున్నాయని. 

అసలేం జరిగిదంటే నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ శివారులోని మహేంద్ర షో రూమ్​లో రాత్రి చోరీ జరిగింది. షో రూమ్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి షో రూమ్ వెనుక నుంచి వచ్చిన దొంగలు డెస్క్​లో ఉన్న రూ.60 వేలు, 3 సెల్ ఫోన్లు చోరీ చేశారు. లాకర్ పెట్టెను తీసుకోపోయే ప్రయత్నంలో అది అధిక బరువు ఉండటంతో దాన్ని చెత్తకుప్పలోనే వదిలి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు చెత్త కుప్పలో లాకర్​ను గుర్తించారు. దానిలో రూ.5 లక్షలు అలాగే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేపట్టారు. పాపం దొంగలు అసలు డబ్బు వదిలేసి చిల్లర తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.