Theft in kodangal : వస్త్ర దుకాణంలో చోరీ.. నగదు, దుస్తులను ఎత్తుకెళ్లిన దుండగులు - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-08-2023/640-480-19202464-99-19202464-1691398502424.jpg)
Theft in Clothing Store in Kodangal : కొడంగల్ పట్టణంలోని వస్త్ర దుకాణంలో చోరీ కలకలం రేపింది. కొడంగల్ పట్టణంలో తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు గడ్డపారలతో దుకాణానికి ఉన్న తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.1.20 లక్షలతో పాటు, కొన్ని దుస్తులను కూడా ఎత్తుకెళ్లారు. యజమాని ఉదయం దుకాణం తెరవడానికి రాగా అక్కడ తాళం విరిగిపోయి, సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా కింద పడి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సీసీటీవీ వీడియోను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు ఊరు వెళ్లేటప్పుడు స్థానిక పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఊరెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగలు, నగదును బ్యాంకు లాకర్‌లో పెట్టుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.