'గుడివాడ గడ్డ తెలుగుదేశం అడ్డా' - కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు - గుడివాడ
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 3:54 PM IST
NTR's death anniversary at Gudivada NTR Stadium : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ తమ్ముళ్లు, తెలుగుదేశం జనసైనికులు, నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి పంతం నెగ్గించుకున్నారు. టీడీపీ - జనసేన శ్రేణుల్ని నియంత్రించ లేక పోలీసులు చేతులెత్తేయగా ఎన్టీఆర్ విగ్రహం ప్రాంగణం నుంచి కొడాలి నాని వేరొక చోటికి వెళ్లిపోయారు. కొడాలి నాని వైఎస్సార్సీపీ అనుచరగణం సైతం అక్కడి నుంచి వెళ్లిపోయింది.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం - జనసేన నేతలు నివాళులర్పించి తమ పంతం నెగ్గించుకున్నారు. ఆ సమయంలో కొడాలినాని వెనుక పదుల సంఖ్యలో మాత్రమే శ్రేణులు ఉన్నారు. వేలాదిగా ఒక్కసారిగా దూసుకొచ్చిన తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని నియంత్రించ లేక పోలీసులు చేతులెత్తేశారు. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్ విగ్రహం ప్రాంగణం నుంచి కొడాలి నాని వేరొక చోటికి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కొడాలినాని వెంట అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
ఎన్టీఆర్ విగ్రహం గుడివాడ గడ్డ తెలుగుదేశం అడ్డా అంటూ టీడీపీ - జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నినదించాయి. చంద్రబాబు పవన్ కల్యాణ్ జోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు పోలీసు బారికేడ్లను తమ వాహనాలతో గుద్దించుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపు దూసుకెళ్లారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వేల సంఖ్యలో దూసుకెళ్లారు. గుడివాడ పట్టణంలో భారీ వాహన ర్యాలీ తో తెలుగుదేశం - జనసేన కార్యకర్తలు కదం తొక్కారు.