TU VC on EC Meeting : 'వీసీ లేకుండా ఈసీ మీటింగ్ చెల్లదు'
🎬 Watch Now: Feature Video
TU VC on EC Meeting : కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ నిర్వహించిన ఈసీ మీటింగ్ చెల్లదని.. వీసీ లేకుండా ఎన్నిసార్లు ఈసీ మీటింగ్ నిర్వహిస్తారని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌గుప్తా ప్రశ్నించారు. వీసీని సంప్రదించకుండా సమావేశం ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ఈసీ సమావేశానికి హాజరైన తెలంగాణ వర్సిటీ ముగ్గురు ప్రొఫెసర్లు నసీమ, రవీందర్, హారతిలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సరైన వివరణ ఇవ్వకుంటే సస్పెండ్ చేస్తామని వీసీ రవీందర్ గుప్తా హెచ్చరించారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా యాదగిరి అనర్హుడని.. నిర్మలాదేవి రిజిస్ట్రార్‌గా కొనసాగుతారన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నిర్మాలా దేవి నియామకంపై 90 రోజుల్లో ఈసీ ఆమోదం కోరతామని తెలిపారు. ఐఏఎస్ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి.. వీసీని చిన్నచూపు చూడటం తగదన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేస్తే.. గవర్నర్ నియమించారని గుర్తు చేశారు. నవీన్ మిత్తల్‌కు సీసీఎల్ఏ, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొదలైన శాఖలు పెరగడం వల్ల సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారన్నారు. యూనివర్సిటీలో టీచింగ్ కోసం ఔట్ సోర్సింగ్, రోజువారీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టామన్నారు.