రేవంత్ రెడ్డి సీఎం కానుండటంతో సచివాలయ ఉద్యోగుల సంబురాలు - పాల్గొన్న కోదండరాం - రేవంత్ సీఎం అవ్వడంతో సచివాలయ ఉద్యోగుల సంబరాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 10:27 PM IST
Telangana Secretariat Employees Celebrations : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానుండడంతో సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తరుణంలో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సంబురాల్లో తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షుడు కోదండరామ్ కూడా పాల్గొన్నారు. ఉద్యోగులు బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొంత మంది ఉద్యోగులు డ్యాన్స్‌లు చేస్తూ ఊర్రూతలూగించారు.
Employees Celebrations at Telangana Secretariat : తెలంగాణ ఉద్యమ పాటలు, రేవంత్ రెడ్డి పాటలకు నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మరోవైపు ఇక నుంచి సచివాలయ ఉద్యోగులకు మంచిరోజులు రానున్నాయని ప్రొ. కోదండరాం అన్నారు. సచివాలయ ఉద్యోగులు కోదండరాంను తమ భుజాలపై ఎత్తుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు స్వీట్స్ పంచుకొని ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఇక ఎవరికీ భయం పడాల్సిన అవసరం లేదని స్వేచ్ఛగా తమ పనులను సక్రమంగా జరుపుకోవచ్చని ఉద్యోగులు తెలిపారు.