Politicians at Lal Darwaza Bonalu 2023 : రాజకీయాలకు అతీతంగా భాగ్యనగరంలో 'బోనాల సంబురం' - తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Hyderabad Lal Darwaza Bonalu 2023 : భాగ్యనగరంలో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం సహా పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే బోనాలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, హరియాణ గవర్నర్ దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ సహా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
అమ్మవారి దర్శనం అనంతరం మాట్లాడిన పలువురు రాజకీయ నాయకులు... తెలంగాణ ప్రజలకు బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాలకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందన్న తలసాని.. కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. రాజకీయాలకు అతీతంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు. లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన రేవంత్.. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో పొడగించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు.