అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి! - American girl married to Telangana boy
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17979832-708-17979832-1678722497566.jpg)
కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి.. ఇక్కడి అబ్బాయికి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఈ పెళ్లి జగిత్యాలలో ఘనంగా జరిగింది. అమెరికాలో ప్రేమించుకున్న ఈ జంట... పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకలోనూ ఉత్సహంగా పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన ముస్కెం ప్రభు అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగంలో అమెరికా టెక్సాస్‌కు చెందిన సెసిలియా అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఇద్దరు మనసులు.. భావాలు కలిశాయి. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో పెళ్లి వేడుకను జగిత్యాలలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. పెళ్లికి ముందుకు జరిగే హల్దీ వేడుకల్లోనూ సెసిలియా తెలుగు సంప్రదాయాల ప్రకారం పాల్గొంది. కట్టుబొట్టు తెలుగు దనం ఉట్టిపడేలా ఆమె అలకరించుకుంది. తెలుగు సైతం కొంచెం కొంచెం మాట్లాడుతున్న సెసిలియా ఇక్కడి సంప్రదాయం బాగుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
TAGGED:
ఎల్లలు దాటిన ప్రేమ