కాస్కో కేసీఆర్.. త్వరలోనే జైలుకు కేటీఆర్, కవిత : బండి సంజయ్ - సింగరేణి సంస్థపై బండి సంజయ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Bandi Sanjay comments on KTR : పదో తరగతి పేపర్ లీక్ కేసులో జైలు నుంచి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. త్వరలోనే కేసీఆర్ కుమారుడు, కుమార్తె జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని ప్రజలంతా గ్రహిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోయేందుకు కారకులు ఎవరని ప్రశ్నించారు.
Bandi Sanjay comments on Singareni : సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం అని బండి సంజయ్ అన్నారు. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేసే హక్కు ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉందని ఆరోపించారు. దాన్ని బీజేపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయదని స్పష్టం చేశారు. సింగరేణిలో జరుగుతున్న అన్యాయం అక్కడ కార్మికులకు తెలుసున్న ఆయన.. కేసీఆర్ కుంటుంబంలో సంవత్సరానికి ఒకరు వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. కుటుంబ పాలన, దోపిడీ, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.