'సిర్పూర్ వాసులు నన్ను దత్తత తీసుకున్నారు' - Sirpur Assembly Elections Results 2023
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 4:11 PM IST
RS Praveen Press Meet on Assembly Election Results : సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ రహస్యంగా ఒక్కటి కావడంవల్లే బీఎస్పీ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజలను భయపెట్టే దోపిడీ, భూకబ్జాదారులను ఓడించామన్నారు. ప్రజలు బహుజన గొంతుకగా నిల్చి బీఎస్పీకి కొత్త ఆశలు రేకెత్తించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, తమ పార్టీ విజయం సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తామన్నారు. సిర్పూర్ ప్రాంత వాసులు తనను దత్తత తీసుకున్నారని తెలిపారు. తాను కూడా ఇక్కడే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారం చేపట్టకపోయినా సిర్పూర్ ప్రజలకు బీఎస్పీ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు.