Teacher Wrong Behaviour in Kamareddy : విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. గురువుకి గుణపాఠం చెప్పిన గ్రామస్థులు - అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయుడి వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2023, 10:46 PM IST

Teacher Wrong Behaviour on Students in Kamareddy : విద్యార్థులకు చక్కగా పాఠాలు చెబుతూ.. వారిని ఉన్నత స్థానాలకి తీసుకెళ్లేందుకు గురువు మొదటి స్థానంలో ఉంటాడు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉపాధ్యయుడ్ని సమాజంలో అందరూ గౌరవిస్తారు. కాని కొంత మంది నీచ బుద్ధి ఉన్న ఉపాధ్యాయుల వల్ల ఆ పేరుకి భంగం కలుగుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయుడు తమ విద్యార్థిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆ టీచర్​ని చిదగబాదారు. అనంతరం పోలీసులకి అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  కామారెడ్డి జిల్లా జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్​లో ఓ ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థిని పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు నిందితుడ్ని చిదకబాదారు. అనంతరం పోలీసులకి తెలియజేశారు. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.