TDP Leader Special Pooja for Chandrababu : చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక పూజలు.. - Telangana politics
🎬 Watch Now: Feature Video
Published : Oct 3, 2023, 4:39 PM IST
TDP Leader Special Pooja for Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో టీడీపీ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుబంధాలయం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో హోమం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి వెంటనే విడుదల కావాలని, చంద్రబాబు కుటుంభం సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజలంతా క్షేమంగా ఉండాలని, చంద్రబాబుపై వేసిన అక్రమ కేసులన్నీ తొలగిపోవాలని ఈ హోమం నిర్వహించారు. చంద్రబాబుపై ఉన్న అభిమానంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ ప్రజలకు అనేక సేవలు అందించాలని సీతారామచంద్ర స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.