Students Strike at Agricultural University : వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత.. విద్యార్థుల అరెస్ట్​ - Rangareddy District News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 5:23 PM IST

Students Strike at Agricultural University : హైదరాబాద్‌ రాజేందర్​నగర్​లో ప్రొఫెసర్​​ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రోడ్డెక్కారు. తక్షణమే అసిస్టెంట్​ ప్రొఫెసర్​, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. 

Horticultural Students Strike in Rajendarnagar : ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను వారించే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులకు, విద్యార్థులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వవిద్యాలయంలో అధికారుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు..  గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. విద్యార్థులు పోరుబాట పట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే అధికారులను నియమించాలని డిమాండ్​ చేశారు. లేనియెడల తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.