Students Risks Lives To Cross River : స్కూల్కు వెళ్లాలంటే రిస్క్ చేయాల్సిందే.. ప్రాణాలను ఫణంగా పెట్టి పడవపై ప్రయాణం - బిహార్లో బడికి వెళ్లాలంటే నది దాటాల్సిన దుస్థితి
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2023, 8:19 PM IST
Students Risks Lives To Cross River : బిహార్.. పశ్చిమ చంపారణ్ జిల్లాలో పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు సాహసం చేస్తున్నారు. పడవలో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ.. సికర్హనా నది దాటుతున్నారు. ప్రాణాలకు ఫణంగా పెట్టి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు.. నదిపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మఝౌలియా, సిక్తా ప్రాంతాల మధ్య ఉన్న సోన్బర్సాలో సికర్హనా నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. దీంతో తమ ఇళ్ల నుంచి సైకిళ్లపై నది వద్దకు వచ్చి.. అక్కడ సైకిళ్లతో పాటు విద్యార్థులు పడవపై ప్రవాహం దాటుతారు. ఒకవేళ పడవ ఓవర్లోడ్ అయితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇలా నిత్యం వందలాది మంది విద్యార్థుల ప్రమాదకరంగా నది దాటాల్సి వస్తోంది. నదిలో ప్రవాహం పెరిగితే పాఠశాలకు వెళ్లలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తాము సురక్షితంగా పాఠశాలకు వెళ్లాలంటే.. ప్రభుత్వం స్పందించి నదిపై ఓ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.