ఫుల్ జోష్‌లో తమన్నా.. 'భల్లే భల్లే' డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూశారా? - తమన్నా లేటెస్ట్ డ్యాన్స్ వీడియో
🎬 Watch Now: Feature Video
Tamannaah Bhatia New Series Jee Karda OTT : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫుల్ జోష్‌లో భల్లే భల్లే డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'జీ కర్దా' ప్రమోషన్స్‌లో భాగంగా.. ముంబయిలో తాను చదువుకున్న ఆర్డీ నేషనల్ కాలేజీని శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా బ్యాండ్ దరువులకు ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేసి.. అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
కాలేజీ సందర్శనలో భాగంగా మాట్లాడిన తమన్నా.. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిగా తనను తాను మార్చుకోవడానికి సహాయం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. తాను కాలేజీలో చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంది. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన తమన్నా.. తమ కలలను ఫాలో అవ్వాల్సిందిగా వారిని ప్రొత్సహించింది. తాను చదువుకున్న కాలేజీకి వెల్లడం చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. తమన్నా నటించిన 'జీ కర్దా' వెబ్‌సిరీస్ జూన్ 15న నుంచి ఓటీటీ వేదిక 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.