'పఠాన్' కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు.. సోదరుడి భుజంపై ఎక్కి 150కి.మీ ప్రయాణం - షారుక్ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 30, 2023, 6:50 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్​ను వీక్షించేందుకు ఓ దివ్యాంగుడు సాహసం చేశాడు. సొంత ఊర్లో టికెట్లు దొరకలేదని పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ సినిమా చూశాడు. బిహార్​లోని భాగల్​పుర్​కు చెందిన మహమ్మద్ రుస్తుమ్​కు చిన్నప్పటి నుంచి కాళ్లు పనిచేయవు. సొంతంగా నిలబడలేని పరిస్థితి. అయితే, తన అభిమాన నటుడు చిత్రం చూడాలని చాలా ఆరాటపడ్డాడు. భాగల్​పుర్​లో టికెట్లు దొరక్కపోయే సరికి.. సోదరుడు సజ్జద్ సహాయంతో కలిసి పక్క రాష్ట్రానికి వెళ్లాడు. భాగల్​పుర్ సరిహద్దును ఆనుకొని ఉన్న బంగాల్​లోని మాల్దాకు రుస్తుమ్​ను తీసుకెళ్లాడు సజ్జద్. ఇద్దరూ కలిసి ఆదివారం మధ్యాహ్నం స్థానిక సంసీర్ హాల్​లో పఠాన్ చిత్రాన్ని వీక్షించారు. సినిమా కోసం ఆరు గంటలు ప్రయాణం చేసి 150 కిలోమీటర్లు దూరం వెళ్లారు ఈ సోదరులు. ఎట్టకేలకు నచ్చిన హీరో సినిమా చూడగలిగానని సంతోషంతో చెబుతున్నాడు రుస్తుమ్.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.