Special Rakhis in Jagtial : వినూత్నంగా ఉండే రాఖీ కోసం చూస్తున్నారా..? అయితే ఇది ట్రై చేయండి.. - మెట్పల్లి రాఖీ వార్తలు2023
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 9:07 PM IST
Special Rakhis in Jagtial : అన్నా-చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటాం. అయితే ఈ వేడుకలు వినూత్నంగా ఉండాలని, అందరినీ ఆకట్టుకునేలా రాఖీల తయారీకి శ్రీకారం చుట్టాడు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువకుడు శివ. తోబుట్టువు ఆప్యాయంగా కట్టిన రాఖీ సంవత్సరం పాటు గుర్తుండేలా రాఖీలు తయారు చేయాలనుకున్నాడు. శివ ఓ గ్రాఫిక్స్ దుకాణ యజమాని. ఈసారి రాఖీ వేడుకలకు వైవిధ్యంగా ఏదైనా చేయాలని తన ఆలోచనలకు పదును పెట్టాడు.
ఆడపడుచు కట్టిన రాఖీ.. వచ్చే రాఖీ పౌర్ణమి వరకు ఉండేలా చూసుకునే విధంగా తయారు చేశాడు. ఎప్పుడూ వెంటే ఉండేలా అన్నా-చెల్లెళ్ల ఫొటోలతో కూడిన రాఖీలను తయారు చేశాడు. రాఖీ మర్నాడు ఆ రాఖీ తీసి పక్కన పెట్టకుండా బీరువాకో, అద్దానికో భద్రపరిచేలా రాఖీ వెనకాల అయస్కాంతం ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆసక్తిగా రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. వివిధ రకాల ఆకృతులు, అందమైన డిజైన్లతో రాఖీలు తయారు చేస్తూ మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు శివ.