Kanpur Municipal Elections : కాన్పూర్లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు - Kanpur Municipal Elections 2023
🎬 Watch Now: Feature Video
Kanpur Municipal Elections 2023 : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అక్కడ విధులు నిర్వర్తించిన ఎస్పీ మూర్తి తెలిపారు. ప్రజలంతా స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరినట్లు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అక్కడి జిల్లా ప్రజలకు, ఎన్నికల అధికారులు, పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
"ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ దేహాత్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 13 నియోజక వర్గాల్లో ఈ ఎన్నికలు జరగగా ప్రజలు ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సహకరించిన ప్రజలు, అధికారులకు ప్రత్యేక అభినందనలు".- మూర్తి, ఎస్పీ, కాన్పూర్ దేహాత్