Solar Plant in Bhadradri Ramayya Temple : భద్రాద్రి రామునికి సౌర వెలుగులు.. రాష్ట్రంలోనే తొలి ఆలయంగా రికార్డ్ - భద్రాద్రిలో సోలార్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2023/640-480-19819033-thumbnail-16x9-badradri-temple.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 20, 2023, 9:09 PM IST
Solar Plant in Bhadradri Ramayya Temple : రాష్ట్రంలో పేరుగాంచిన ప్రత్యేక దేవాలయాల్లో భద్రాచలం సీతారాముల గుడి ఒకటి. ఈ ఆలయానికి మరో ఘనత దక్కింది. రాష్ట్రంలోనే మొదటి సోలార్ సిస్టమ్తో పనిచేసే దేవస్థానంగా పేరుపొందనుంది. సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్(Sun Technology Private Limited) ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్ ను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ప్రారంభించారు. సుమారు రూ.2.5 కోట్లు ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు.
Solar Plant Temple in Telangana : మొదటిగా 75 కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్లాంట్ను రూపొందించామని రమాదేవి అన్నారు. రాబోయే ముక్కోటి వరకు పూర్తి స్థాయిలో 500 కిలోవాట్ల ప్రాజెక్ట్ను అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆలయాల్లో సోలార్ ప్లాంట్(Solar Plant)తో పనిచేస్తున్న దేవాలయంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి సోలార్ వెలుగులతో ఆలయాన్ని మరింత ఆకర్షవంతంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు భారీగా తగ్గుతుందని రమాదేవి తెలిపారు.