హైదరాబాద్‌లో స్నో కింగ్‌డమ్ - మంచులో ఆడుకోవాలనిపిస్తే అక్కడకు వెళ్లాల్సిందే? - మాదాపూర్‌లో స్నో పార్క్
🎬 Watch Now: Feature Video
Published : Dec 22, 2023, 2:24 PM IST
Snow Kingdom in Hyderabad : ఊటీని తలపించే అందాలు, కశ్మీర్లోలాగా కురిసే మంచు ఇలాంటి అందాలను చూడాలన్నా శీతాకాలంలో అసలైన థ్రిల్ ఎంజాయ్ చేయాలన్నా పిల్లా పెద్దా అంతా ఎంతో ఆసక్తి చూపుతారు. ఇలాంటి ప్రదేశాలను ఒకసారైన చూడాలని ఎవ్వరికైనా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఏదైనా మంచు ప్రదేశాలకు వెళ్లాలని అనిపిస్తుంటుంది. ఆ ప్రదేశాలను వీక్షించేందుకు మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ మాల్‌లో స్నో కింగ్‌డమ్, అతిశీతల మాయాజాలాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో మంచు ప్యాలెస్‌లు, మంచుతో కప్పిన పర్వతాలు, నల్ల సీల్స్‌తో కూడిన ఓక్ చెట్లు, స్నో హట్స్, ధ్రువ ఎలుగుబంట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సువిశాలమై విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మంచు సామ్రాజ్యంలో ఫొటోలు దిగుతూ, స్నోలో ఆడుతూ సందర్శకులు సందడి చేశారు. నగరవాసులకు సంవత్సరంపాటు అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు స్నో కింగ్‌డమ్ ఎండీ తెలిపారు. అతి తక్కువ ధరలోనే 45 నిమిషాల పాటు మంచులో ఆడుకోవడం, టోబోగానింగ్, స్నో డ్యాన్స్ వంటి కార్యక్రమాలు చక్కటి అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు.