Silver Ganesh Idol in Nizamabad : వెండి పత్రాలతో ఆకట్టుకుంటున్న వినాయకుడి విగ్రహం - Silver Ganesh Video
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 10:48 PM IST
Silver Ganesh Idol in Nizamabad : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా వినాయక మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. వివిధ రూపాల్లో ఉన్న గణేశుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాలో వెండితో తయారు చేసిన గణపతి ( Silver Ganesh) విగ్రహం అందరిని ఆకర్షిస్తోంది.
Vendi Ganesh Idol in Nizamabad : నిజామాబాద్ నగరంలోని మమ్మదేవి నగర్ భజరంగ్ యూత్ గణేశ్ మండలి యువకులు వెండి పత్రాలతో రూపొందించిన.. వినాయక విగ్రహన్ని ప్రతిష్ఠించారు. దీనిని తయారు చేసేందుకు సుమారు మూడున్నర కిలోల వెండిని వినియోగించామని నిర్వహకులు తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో గణేశుడిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ కాంతుల నడుమ దగదగ వెలిగిపోతూ గణపయ్య.. భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. ఈ విభిన్నమైన గణనాథున్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో వస్తున్నారని నిర్వహకులు వివరించారు.