ఈ పక్షుల మధ్య బంధం ప్రేమమయం.. ఆ ఊరితో అనుబంధం అజరామరం - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18174267-thumbnail-16x9-birdds.jpg)
Siberian storks migrated to Telangana: పల్లె వాతావరణం అంటేనే చెట్లు, పచ్చని పొలాల మధ్యన చిన్నని ఇళ్లు, చల్లని గాలి, పొలం గట్లు, చెరువులు, కాలువలు, ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు, అతిథులులా వచ్చిపోయే పక్షులు, పక్షుల కిలకిలరావాలు, కల్మషం లేని మనుషులు.. అబ్బా వింటుంటూనే మనస్సు ఆనందంతో పులకించి పోతుంది కదా! సహజ అందంతో అందరిని ఆకట్టుకునే పల్లెలకు.. విదేశాల నుంచి వందల సంఖ్యలో పక్షులు వచ్చి ఆ ప్రాంతంలో సందడి చేస్తే ఎలా ఉంటుంది. ఊర్కే ఏదో చెబుతున్నా అనిపిస్తుందా! కానీ ఇది నిజం. సుర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రతి ఏడాది సైబీరియన్ కొంగలు వలస వస్తాయి.
ప్రతి ఏడాది కొత్త సంవత్సరం సమయంలో సైబీరియా, ఉత్తర యురేషియా ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కొంగలు తెలంగాణ ప్రాంతంలోని పస్తాల ,కర్విరాల, కొత్తగూడెం గ్రామాలకు వలస వస్తుంటాయి. జంటగా వచ్చే ఈ పక్షులు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి.. పిల్లలను కని.. కుటుంబంగా ఏర్పడి తిరిగి వెళ్తుంటాయి. ఈ పక్షుల రాకతో ఆ ప్రాంతాలకు ఎంతో కళ వచ్చేస్తుంది. ఈ ఏడాది కూడా సైబరీయన్ కొంగలు వచ్చేశాయి. తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఎంతో సందడిగా మార్చేశాయి. ఈ పక్షులను చూడటానికి సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వస్తుంటారు.