SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది' - SI Hemalatha full details
🎬 Watch Now: Feature Video
SI Hemalatha interview in Tealangana : తల్లిదండ్రుల ప్రోత్సాహం, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే లక్ష్య సాధనలో విజేతలుగా నిలవొచ్చని నిరూపించింది మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో ఒటాయి గ్రామానికి చెందిన యువతి బొల్లబోయిన హేమలత. పేదరికం పలకరించినా.. బంధుగణం హేళన చేసినా.. సర్కారు ఉద్యోగం సంపాదించాలన్న కలను సాకారం చేసుకుంది. ఇటీవల వెలువడిన ఎస్సై ఫలితాల్లో సివిల్ ఎస్సై ఉద్యోగం సంపాదించి తన గ్రామానికే వన్నె తీసుకొచ్చింది. తన విజయంలో ఈనాడు దిన పత్రిక(Eenadu Paper) కీలకంగా నిలిచిందంటోన్న హేమలత.. ఖాకీ చొక్కాతో తన గ్రామంలో అడుగుపెడతానని చెబుతోంది. సజ్జన్నార్, రంగనాథ్ లాంటి ఐపీఎస్ అధికారులు తనలో ఎంతో స్ఫూర్తి నింపారంటోన్న ఆమె తెలిపింది. ఆడపిల్లను ఇంటికి భారం కాదని.. వారిని నమ్మి తల్లిదండ్రులు ముందుకు అడుగులు వేస్తే అద్భుతాలు సాదిస్తారని పేర్కొంది. తాను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చి.. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిందని చెప్పిది. ఇంతటి ఘనత సాధించిన హేమలతతో ముఖాముఖి.