శిర్డీలో నూతన సంవత్సర శోభ - పూలతో అందంగా ముస్తాబు - Shirdi Sai Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 4:50 PM IST

Shirdi Sai Temple With Garlands: నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని శిర్డీ ఆలయం రంగు రంగు పూలతో అందంగా ముస్తాబైంది. సాయి మందిరాన్ని పూలతో మాత్రమే కాకుండా, రంగు రంగుల విద్యుత్​ దీపాలతో ఎంతో ఆకర్షణీయంగా ఆలంకరించారు. పూలకయ్యే ఖర్చును విరాళాల ద్వారా వచ్చిన నగదును వినియోగిస్తున్నారు. ద్వారకామాయి, చావడితో పాటు గభార మందిరం బయటి ప్రాంగణాన్ని పూలతో అందంగా ఆలకరించడంలో బెంగుళూరుకు చెందిన మాజీ మంత్రి బసవరాజు విరాళాలు అందించారు.

2023 సంవత్సరం చివరి రోజు అంతేకాకుండా నూతన సంవత్సర సందర్భంగా శిర్డీ ఆలయానికి భక్తుల రద్దీ పోటెత్తింది. ఈ క్రమంలో సాయి సేవా సంస్థాన్​ ఆలయాన్ని రంగు రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించింది. ఇందుకోసం వేలాది సంఖ్యలో పూలను వినియోగించి, వందలాది పూలదండలు రూపొందించారు. ఇందుకు 60 మంది కళాకారులు 6 రోజులుగా శ్రమించి పూలదండలను తయారు చేశారు. వీటికయ్యే ఖర్చును సాయి భక్తుల ద్వారా అందిన విరాళాలను వినియోగించినట్లు ట్రస్ట్​ అధికారులు వివరించారు. దాదాపు 10లక్షల రూపాయలను వెచ్చించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం రామరథ ఆకారంలో పూలతో ఆలంకరించారు. సాయి ఈ రథంలో కూర్చున్న విధంగా కనిపించేలా రూపొందించినట్లు కళాకారులు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.