Apsara Murder Case Update : 'మొదటి నుంచి సాయికృష్ణపైనే అనుమానం ఉండేది' - అప్సర హత్య కేసు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

Shamshabad CI on Apsara Murder Case : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన యువతి అప్సర కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5న ఉదయం యువతి తల్లితో కలిసి సాయికృష్ణ పీఎస్కు వచ్చి తమ బంధువు అయిన అప్సర అనే యువతి కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టగా అసలు కోణం బయటకు వచ్చింది. సాయికృష్ణ చెప్పేది అంతా నమ్మశక్యంగా లేకపోవడంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యాకోణం వెలుగులోకి వచ్చిందని సీఐ పేర్కొన్నారు. ఆమె వేధింపులు తట్టుకోలేకనే అప్సరను హత్య చేసినట్లు సాయకృష్ణ ఒప్పుకున్నాడన్న ఇన్‌స్పెక్టర్.. ఈ హత్యలో ఇంకెవరైనా ఉన్నారనే దానిపై విచారిస్తున్నామన్నారు. నిందితుడు వెంకటసాయి కృష్ణ... అప్సరను శంషాబాద్‌లో హత్య చేసి మృతదేహాన్ని సరూర్‌నగర్ లోని సెప్టిక్ ట్యాంక్ లో పడేసినట్లు విచారణలో గుర్తించినట్లు చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసి... ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం సీఐ శ్రీనివాస్ మనకు అందిస్తారు.