Selfie Suicide in Jagtial : బైక్ షోరూం యజమాని సూసైడ్.. సెల్ఫీ వీడియోలో బయటపడిన కారణం - selfi suicide because Cheated a person
🎬 Watch Now: Feature Video
Selfie Suicide in Jagtial : తన వద్ద పనిచేసే నమ్మకస్థుడు చెప్పిన ఆలోచనతో ఓ స్కీమ్ షురూ చేశాడు బైక్ షోరూమ్ యజమాని. కానీ ఆ వ్యక్తి నట్టేట ముంచడంతో అప్పులపాలై చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఈ విషయాన్ని అందరికీ తెలియజేశాడు. అంతేకాదు.. తన వల్ల నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.
అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో ద్విచక్రవాహనాల షోరూం యజమాని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న హీరో షో రూమ్ యజమాని సబ్బాని నరేశ్ హైదరాబాద్‌లో సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్ పల్లి చైతన్యనగర్‌కు చెందిన సబ్బాని నరేశ్ కథలాపూర్ మండల కేంద్రంలో కొంతకాలంగా హీరో షోరూం నడుపుతున్నాడు.
అతని వద్ద పనిచేస్తున్న ప్రతాప్ చెప్పిన ఆలోచనతో భవాని ఎంటర్ ప్రైజెస్ పేరుతో వాహనాల లక్కీ డ్రా ప్రారంభించారు. ఆ స్కీం పేరుతో ప్రతాప్ కోటి 90 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని నరేశ్ ఆరోపించాడు. బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు