School Bus Accident in Warangal : పాఠశాల బస్సును ఢీ కొట్టిన ఎమ్మెల్యే సతీమణి వాహనం... - warangal latest news
🎬 Watch Now: Feature Video
School Bus Accident in Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల బస్సును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి వాహనం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కొందరు విద్యార్ధులకు గాయాలయ్యాయి. పట్టణ కేంద్రానికి చెందిన పాత్ ఫైండర్ పాఠశాలకు చెందిన బస్సు కమలాపురం నుండి నారక్క పేటకు వెళ్లే క్రమంలో బస్సును జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న విద్యార్థులంతా నల్లబెల్లి మండలం నార్కపేట గ్రామానికి చెందినవారు. కారులో ఉన్నపెద్దిసుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఉన్నాయి. కారు బెలూన్స్ తెరుచుకొవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఆమెకు స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.