జేబీఎస్​ బస్టాండ్​లో సజ్జనార్​ - ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 5:35 PM IST

Sajjanar Conducted Surprise Inspection JBS Bus Stand : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఈ వెసులుబాటును మహిళామణులకు అందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉచిత ప్రయాణ అమలుపై కండక్టర్లను, ప్రయాణికుల అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డ్ జారీ చేస్తామని సజ్జనార్ ప్రకటించారు. ఉచిత ప్రయాణం ప్రకటించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న రద్దీ లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. 

Free Bus Scheme For Women : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేనిఫేస్టోలోని భాగంగా ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలను అమలు చేసింది. మహలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలకు, ట్రాన్స్​ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆర్టినరీ, ఎక్స్​ప్రెస్​, పల్లె వెలుగు, సిటీ మెట్లో బస్సుల్లో ఉచితంగా వారు ప్రయాణించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.