Saikrishna Father Interview : 'అప్సరను మా కుమారుడు హత్య చేసి ఉండడు' - అప్సర హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి
🎬 Watch Now: Feature Video

Saikrishna Father Narasimhamurthy Interview : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన అప్సరను తన కుమారుడు హత్య చేసి ఉండడని తాము భావిస్తున్నామని సాయికృష్ణ తండ్రి నరసింహమూర్తి తెలిపారు. మూడు నెలలుగా యువతే వేధింపులకు గురి చేసినట్లు సాయి తనకు చెప్పారని అన్నారు. పిల్లలు ఉన్నా.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టిందని చెప్పారు. అమ్మాయి వేధించే విషయం... అప్సర ఇంటికి సాయి వెళ్తున్నాడన్న విషయం ముందే తెలిస్తే... కచ్చితంగా మందలించేవాడినని నరసింహమూర్తి చెబుతున్నారు. నిజానిజాలు విచారణలో తెలుస్తాయని సాయికృష్ణ తండ్రి వివరించారు. తప్పు ఎవరు చేసినా.. తప్పే అన్నారు. ఆరోగ్యం బాగోలేక నెల రోజుల నుంచి తాను గుడికి వెళ్లడం లేదన్న నరసింహమూర్తి... సాయికృష్ణ ప్రవర్తన తప్పుగా ఉందని ఇంతవరకూ ఎవ్వరూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఆ అమ్మాయే మా అబ్బాయి అందంగా ఉన్నాడని.. ఆ యువతే ఇలా చేసిందన్నారు. ఆ అమ్మాయిని మావాడే ఇష్టపడ్డాడనుకుంటే అప్సరను ఎందుకు చంపేవాడన్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలుస్తాయన్నారు.