ఖైరతాబాద్‌లో అట్టహాసంగా సదర్ ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న దున్నరాజుల విన్యాసాలు - ఖైరతాబాద్ సదర్ 2023
🎬 Watch Now: Feature Video


Published : Nov 14, 2023, 1:09 PM IST
Sadar celebrations in Hyderabad 2023 : సదర్ వచ్చిదంటే చాలు.. భాగ్యనగరంలో ఆ సందడే వేరు. కోట్లాది రూపాయల విలువ చేసే దున్నపోతులు విన్యాసాలతో ఆకట్టుకుంటాయి. దీపావళి మరుసటి రోజు నిర్వహించే సదర్ వేడుక ఈసారీ మరిన్ని విశేషాలతో ఘనంగా సాగుతున్నాయి. హరియణా, పంజాబ్, ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన మేలు జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని మరుసటి రోజు ఏటా యాదవ సోదరులు నిర్వహించే సదర్ వేడుకలు.. నవయుగ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన.. స్థానిక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సవాలను ప్రారంభించారు.
Sadar Festival Celebrations at Khairatabad 2023 : అనంతరం యాదవ సోదరులతో కలిసి దానం నాగేందర్.. కత్తి, కర్ర విన్యాసాలు చేశారు. నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సదర్ ఉత్సవాలకు వచ్చిన వివిధ రకాల దున్నపోతులను ప్రదర్శించి.. వాటితో ప్రత్యేక వినోద కార్యక్రమాలు నిర్వాహకులు చేయించారు. డప్పు చప్పులు యువత నృత్యాల నడుమ దున్నరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.