Viral Video లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ క్యాబిన్‌లోకి ఎక్కి దాడి చేసిన ఆర్టీవో సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 14, 2023, 7:39 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

నిజామాబాద్ జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన లారీ డ్రైవర్​పై రవాణా శాఖ సిబ్బంది దాడి చేయగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే 44వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపగా ఓ ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రయాణికుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లారీని వెంబడిస్తూ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఆర్మూరు ఆర్టీవో చెక్​పోస్టు వద్ద సిబ్బంది లారీని ఆపారు. ఆర్టీవో సిబ్బందితోనూ అతడు దురుసుగా ప్రవర్తించడంతో లారీ క్యాబిన్‌లోకి వెళ్లి దాడి చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది. దీంతో లారీ డ్రైవర్​పై దాడి ఘటనలో రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దాడి చేయటం సరికాదన్న డీటీసీ వెంకటరమణ ఎంవీఐ సత్యమూర్తి, కానిస్టేబుళ్లు ప్రసాద్, భాస్కర్​లను ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం నుంచి రవాణా శాఖ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.