RTC JAC Chairman Aswatthama Reddy on RTC Bill Controversy : 'గవర్నర్‌ లేవనెత్తిన అంశాలన్నీ కార్మికుల కోసమే' - Governor Tamilsai

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 3:52 PM IST

RTC JAC Chairman Aswatthama Reddy on RTC Bill Controversy : ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్‌ లేవనెత్తిన అంశాలన్నీ కార్మికుల కోసమే ఉన్నాయని.. వాటన్నింటిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మిక నేతలతో తమిళిసై సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. కార్మికుల భుజాలపై తుపాకీ పెట్టి, గవర్నర్‌ను కాల్చేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌పై అపవాదు వేస్తూ.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కలిసి రాజ్‌భవన్‌ వద్ద ధర్నా చేయించిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో గతంలోనే ఆర్టీసీ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని.. విలీనం తర్వాత మరోసారి అలాంటి పరిస్థితి రావొద్దని మాత్రమే గవర్నర్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు. గవర్నర్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కార్మికులకు ఇవ్వాల్సిన పీఆర్​సీ, భవిష్య నిధి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ కార్మికులతో సమ్మే చేయిస్తోందని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.