సంగారెడ్డిలో కారును తప్పించబోయి ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు- పదిమందికి గాయాలు - జహీరాబాద్‌లో బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 5:38 PM IST
RTC Bus Accident In Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి ముళ్ల పొదలోకి దూసుకెళ్లింది. జహీరాబాద్-బీదర్ రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదానికి గురైందని పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నిర్లక్షంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Road Accident In Sangareddy District : అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రమాదాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో వారంతా ఊపిరి పిల్చుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. డ్రైవర్ స్పీడ్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చెబుతున్నారు.