ఇంజినీరింగ్‌పై మక్కువ.. 'రివర్స్' క్లాక్ తయారీ.. టైమ్ మాత్రం కరెక్ట్! - reverse clock
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2023/640-480-19005012-thumbnail-16x9-clock.jpg)
Reverse Rotating Clock : చండీగఢ్‌కు చెందిన బల్వీందర్ సింగ్.. అపసవ్య దిశలో (Anti Clock Wise Direction) తిరిగే గడియారాన్ని తయారు చేశారు. అపసవ్య దిశలో తిరిగినప్పటికీ.. మామూలు గడియారాల్లాగే ఇది సరైన సమయాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ మీద ఉన్న మక్కువతో బల్వీందర్ సింగ్.. మూడేళ్ల పాటు కష్టపడి ఈ గడియారాన్ని తయారు చేసినట్లు స్పష్టం చేశారు. 'నా స్నేహితుడు ఒకరు.. రాజస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ కోటలో ఇలాంటి గడియారాన్ని చూశానని చెప్పాడు. గడియారం వ్యతిరేక దిశలో తిరుగుతున్నప్పటికీ.. సమయాన్నిసరిగ్గా చూపుతోందని తెలిపాడు. కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అని భావించే నేను.. ఎందుకు ఇలాంటి గడియారం చేయకూడదని అనుకున్నా. ఆలోచన రాగానే గడియారం తయారు చేయడం ప్రారంభించాను. అలాగే గడియారం కొంచెం భిన్నంగా ఉండేందుకు అంకెలను పంజాబీ భాషలో ఉంచాను' అని బల్వీందర్ సింగ్ అన్నారు. ఈ గడియారమే కాకుండా అతి చిన్న 'టేబుల్ ఫ్యాన్' కూడా తయారుచేసి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించారు బల్వీందర్ సింగ్.