Revanth Reddy Fires on CM KCR : కేసీఆర్‌కు ధైర్యముంటే కొడంగల్‌లో పోటీ చేయాలి : రేవంత్ రెడ్డి - ఈ రోజు తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Oct 24, 2023, 6:46 PM IST
Revanth Reddy Fires on CM KCR : సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్‌లో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని చెప్పారు.. కానీ ఇంత వరకు ఆ పని ఎందుకు చేయలేదోనని ప్రశ్నించారు. కొడంగల్‌ను బీఆర్ఎస్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డి పల్లెలో దసరా పండగ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా" శిఖరం మరువదు.. తన పునాదులు భూమి మీదే ఉన్నాయని. మహా వృక్షం మరువదు.. తన వేళ్లు మట్టి పొరల్లోనే ఉన్నాయని. నాకు జన్మనిచ్చిన గడ్డ.. నేను పుట్టి పెరిగిన మట్టి.. నన్ను పెంచి ప్రేమను పంచిన ఊరు అంటూ" రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈసారి తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ జెండాను ఎగురవేయడానికి హస్తం పార్టీ అన్ని వ్యూహాలను సిద్ధం చేసింది.