'మోదీ మేడిగడ్డను ఎందుకు పరిశీలించలే - బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే' - తెలంగాణలో మోదీ పర్యటనపై మండి పడ్డ రేవంత్
🎬 Watch Now: Feature Video
Published : Nov 8, 2023, 4:34 PM IST
Revanth Reddy comments on Modi Tour : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, పగిలిన అన్నారంను పరిశీలించాలని.. తాను చెప్పినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి పరుల పట్ల చండశాసనుడిని అని చెప్పుకునే మోదీ.. మేడిగడ్డను చూడకపోతే ఆయన పర్యటనతో ఏం లాభమని ప్రశ్నించారు. మేడిగడ్డ కూలిన పాపంలో.. మోదీకి ఎంత భాగస్వామ్యం ఉందో చెప్పాలన్నారు.
Revanth Reddy fires on KCR : మేడిగడ్డ, అన్నారం అంశంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య భాగస్వామ్యం లేకపోతే.. అక్కడికి ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీకి కేసీఆర్ స్నేహితుడు కాకుంటే.. ప్రత్యర్థి అయితే ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని.. తెలంగాణకు ప్రజలకు కాదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్టుల పేరుతో.. కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కట్టిన బ్యారేజీ మేడిపండులాగా పగిలిపోయిందని ఎద్దేవా చేశారు.