రేవంత్ రెడ్డి వర్సెస్ అసదుద్దీన్ ఒవైసీ-ఆ సవాల్‌కు సిద్ధమై అంటూ రేవంత్ వ్యాఖ్యలు - తెలంగాణ కాంగ్రెస్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 9:44 PM IST
Revanth Reddy Challenge to Asaduddin Owaisi : కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి ఎంఐఎం అధినేత ఒవైసీ తన ఇంట్లో విందు ఇచ్చారని.. అలా ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఆయన సిద్ధమా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం రోజు ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారు దేవాలయం వద్దకు భగవద్గీత చేత పట్టుకొని వస్తానని.. అదేవిధంగా మక్కా మసీదుకు తాను వస్తానని.. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి అసదుద్దీన్ సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ఎంఐఎం అధినేత మీద ఈ వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Comments on Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి శర్వాణి లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ ఆయన శర్వాణి కింద కాకి నిక్కర్ ఉందని అర్థమైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ పోటీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్, మోదీలాంటి దొంగలను కాపాడడానికి ఒవైసీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.