Renuka Chowdary on Tummala Joining in Congress : "కాంగ్రెస్లోకి తుమ్మల వస్తే స్వాగతిస్తాం : రేణుకా చౌదరి" - Khammam district latest political news
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2023, 3:47 PM IST
Renuka Chowdary on Congress Joinings : కాంగ్రెస్పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరునున్నట్లు వదంతులు వస్తున్నాయని.. పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గంగానది వంటిదని.. ఎందరో నాయకులకు రాజకీయ జీవితం ప్రసాదించిందని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్, మమతాబెనర్జీ మొదలగు నేతలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం వాస్తవం కాదా.. అని వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. గుండాల మండలంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న రేణుకా చౌదరి.. వ్యవసాయ పనులు చేస్తున్న మహిళలతో కలిసి నాట్లు వేశారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలాల వద్దకు వెళ్లారు. నేటి కాలంలో రాజకీయాలు చేసేందుకు అనేకమంది వస్తున్నారని.. ఖరీఫ్, రబీ గురించి తెలియని వారు ఎన్నికల సమయంలో వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమని.. అనుమానిస్తున్నారు కానీ మేమంతా రైతు బిడ్డలుగా, కర్షకుల కష్టాలు తెలిసిన వారమేనని పేర్కొన్నారు.