Attack On Lovers At Gadwala : ప్రేమ వివాహం.. పోలీస్‌స్టేషన్‌లోనే లవర్స్‌పై దాడి.. రోడ్డుపై పరుగులు తీసిన జంట - Love marriages
🎬 Watch Now: Feature Video
Relatives attack on love couple in Gadwala Rural Police : వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పెళ్లి కూడా చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో స్టేషన్ వద్ద ఉన్న ప్రేమ జంటపై తల్లిదండ్రులు, వారి బంధువులు దాడి చేశారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రేమ జంట రోడ్డుపై పరుగులు తీసిన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన శిరీష(22), గద్వాల్ పట్టణానికి చెందిన చెందిన ప్రశాంత్ (25) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో స్టేషన్‌వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ప్రేమజంటతో గొడవకు దిగి స్టేషన్లోనే ఇరువురిపై దాడి చేశారు. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై పరుగులు తీస్తూ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.