'రామ..రామ ఇదేం పని'.. శ్రీరామనవమి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్ - Nomula Bhagat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2023, 1:36 PM IST

Updated : Mar 31, 2023, 2:22 PM IST

Recording dance at Srirama navami celebrations in Nalgonda : సాధారణంగా శ్రీరామనవమి సందర్భంగా.. ఆ రోజు రాత్రి భక్తికి సంబంధించిన భజన కార్యక్రమాలో.. నాటక ప్రదర్శనలో ఉంటాయి. కానీ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి దాటాక రికార్డింగ్​ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఇందులో విడ్డూరమేమిటంటే వీటిని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ నిర్వహించారు. 

అధికార బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోముల భగత్ వర్గం, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం, కాంగ్రెస్ పార్టీ , మరొక రెండు సామాజిక వర్గాల వారు మొత్తం తిరుమలగిరిలో గుంటూరుకి చెందిన రికార్డింగ్ డాన్స్​ బృందాలతో ఆరు చోట్ల ఏర్పాటు చేశారు. డాన్స్​ వేడుకల్లో పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ చిందులు వేయించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పోటా పోటీగా రికార్డింగ్ డ్యాన్సు ఏర్పాటు చేయడంతో ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకోనుందోననేది చర్చనీయాంశమైంది. 

Last Updated : Mar 31, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.