Rakhi Wishes in Innovative Way : హ్యాపీ రక్షాబంధన్.. హసన్​పర్తి విద్యార్థుల వినూత్న విషెస్ - Hanumakonda Rakhi Latest Information 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 6:32 PM IST

Rakhi Wishes in Innovative Way : రాఖీ పౌర్ణమి వేళ విద్యార్థుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. వీరు చిన్నారులు కాదు.. చిచ్చర పిడుగులు అన్నట్లుగా ఉన్నది వారి ప్రదర్శన. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండల కేంద్రానికి చెందిన ఏకశిలా ఈ టెక్నో పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు వినూత్నంగా తెలియజేసేలా విద్యార్థులు చేసిన ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.

నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. అంటూ విద్యార్థులు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల్లో సోదరభావం పెంపొందుతుందని.. తెలుగు వారి సంస్కృతీ-సంప్రదాయాలు సజీవంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల ఆత్మీయత, అనురాగాలు వెల్లివిరిసాయి. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులకు.. మహిళా నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాఖీలు కట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.